ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జన్మదిన వేడుకల్లో సేవా కార్యక్రమం

రిపోర్టర్: SYAM స్థలం: సీతారామపురం

సీతారామపురం మండలంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జన్మదినం సందర్భంగా టీడీపీ కన్వీనర్ చింతల శ్రీనివాసులు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దేవమ్మ చెరువు, వేంపల్లి తోక గ్రామాల్లో వంద పేద కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రజల సంక్షేమం కోసం భవిష్యత్తులోనూ ఇటువంటి సహాయ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని నిర్వాహకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.