అగ్ని ప్రమాదాల నివారణపై విద్యార్థులకు ప్రాణరక్షణ పాఠాలు నేర్పిన ఫైర్ సిబ్బంది
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో అగ్నిమాపక శాఖ అధికారి దేవానంది శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు క్షతగాత్రులకు అందించాల్సిన ప్రథమ చికిత్స విధానాలపై సిబ్బంది వివరించారు.