లుకౌట్ సర్క్యులర్ ఎత్తివేయాలని పోలీసులను కోరిన యూట్యూబర్ రమానందన
రిపోర్టర్: విజయ్
స్థలం: రంగారెడ్డి
ఆర్థిక మోసాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ రమానందన ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట హాజరయ్యారు. తనపై ఉన్న లుకౌట్ సర్క్యులర్‌ను ఎత్తివేస్తే లండన్ వెళ్లిపోతానని ఆమె పోలీసులను కోరారు. డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగాల పేరుతో మోసం చేశారనే ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరిపారు. అయితే ఆమె అధికారుల ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం.