పేదల గుడిసెలకు హైకోర్టు స్టే.. కలెక్టర్‌కు కాపీ అందజేత

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం 27వ డివిజన్ శ్రీనివాస్‌నగర్‌లోని టింబర్ డిపోలు, కర్ర కోత మిషన్లను తరలించాలని కోరుతూ స్థానికులు కలెక్టర్, మున్సిపల్ అధికారులకు వినతిపత్రాలు అందించారు. కాలుష్యం, భారీ లారీల రాకపోకలతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డిపోలను నగర శివార్లకు తరలించాలని కోరారు. అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పేదల గుడిసెల తొలగింపుపై హైకోర్టు స్టే ఆర్డర్ కాపీని మాజీ కార్పొరేటర్ దొడ్డ నగేష్ కలెక్టర్‌కు అందించారు.