తమిళనాడులో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య, ఉపాధ్యాయుడు అరెస్ట్

రిపోర్టర్: హరి స్థలం: తమిళనాడు

తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో పదో తరగతి విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ బాలిక ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు జగదేసన్‌ను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి దర్యాప్తు జరుపుతున్నారు.