అశ్వాపురం: బస్సులో చిల్లర కోసం గొడవ కండక్టర్పైకి ప్రయాణికురాలు దాడి

రిపోర్టర్: వెంకట్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో చిల్లర విషయంలో జరిగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మణుగూరు డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సులో ప్రయాణికురాలితో చెలరేగిన వాగ్వాదం కారణంగా మహిళా కండక్టర్ కదులుతున్న బస్సు కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రయాణికురాలను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ఎల్లయ్య వెల్లడించారు. బాధితురాలిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.