సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన: మార్కెట్లలో జోరుగా నాన్గ్రీన్ క్రాకర్స్ విక్రయాలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: న్యూఢిల్లీ

దిల్లీ మార్కెట్లలో గ్రీన్ క్రాకర్స్ నిబంధనలు ఉల్లంఘించి సాధారణ టపాసులు బహిరంగంగా విక్రయిస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి వరాలే ధర్మాసనం ఈ ఉల్లంఘనలపై వెంటనే స్పందించాలని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని ఆదేశించింది. లైసెన్స్ లేనివి, క్యూఆర్ కోడ్ లేని టపాసులు కూడా విక్రయిస్తున్నారని మీడియా రిపోర్టును ధర్మాసనం ప్రస్తావించింది.