వైద్య చరిత్రలో అరుదైన ఘటన: తనకే గుండె మార్పిడి చేసుకున్న ప్రముఖ సర్జన్

రిపోర్టర్: రాము స్థలం: New York

ప్రముఖ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ రాబర్ట్ మాంట్గోమేరీ తన జీవితంలో ఊహించని మలుపును ఎదుర్కొన్నారుని వైద్య నిపుణులు వెల్లడించారు. ఎంతోమందికి ప్రాణం పోసిన ఆయన, 2018లో తీవ్ర గుండె జబ్బు బారిన పడి స్వయంగా రోగిగా మారారు. తన సహచర వైద్యుడు డాక్టర్ నాడెర్ మోజామి ఆధ్వర్యంలో ఆయనకు విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ అరుదైన అనుభవం రోగుల వేదనను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి తనకు సహాయపడిందని ఆయన స్పష్టం చేశారు.