కరీంనగర్ నూతన కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ
రిపోర్టర్: శివ
స్థలం: సిద్దిపేట
కరీంనగర్ నూతన కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఉన్నతాధికారుల సమక్షంలో అధికారికంగా ఆవిష్కరించినట్లు పొన్నం ప్రభాకర్ - మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వెల్లడించారు. అనంతరం నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై ఘనంగా నివాళులర్పించారని తెలిపారు.