దేశంలో డీజిల్ కొరత వేళ ఇంధన విక్రయాలపై ఆంక్షలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
దేశీయ ఇంధన మార్కెట్లో బల్క్ మరియు రిటైల్ డీజిల్ ధరల మధ్య భారీ వ్యత్యాసం కారణంగా కొత్త సంక్షోభం నెలకొన్నట్లు నిపుణులు తెలిపారు. ఫ్యాక్టరీలు, హోటళ్లు నేరుగా కొనుగోలు చేయడం మానేసి రిటైల్ బంకుల నుంచే పెద్ద మొత్తంలో డీజిల్ కొనుగోలు చేస్తుండటంతో నిల్వలు వేగంగా ఖాళీ అవుతున్నాయి. సాధారణ వాహనదారులకు ఇబ్బంది కలగకుండా జియో-బీపీ, నయారా ఎనర్జీలు డీజిల్ విక్రయాలపై గరిష్ట పరిమితులు విధించాయని ప్రైవేట్ ఇంధన సంస్థల వర్గాలు స్పష్టం చేశాయి.