'తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం': సికింద్రాబాద్‌లో ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్ ప్రారంభం

రిపోర్టర్: రమేష్ స్థలం: Secunderabad

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్‌ను గౌరవ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. విమోచన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను, ఆనాటి చారిత్రక ఘట్టాలను నేటి తరానికి తెలియజేసే ఉద్దేశంతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు.