బెంగళూరులో రోడ్డు ప్రమాదం: తృటిలో ప్రాణాలతో బయటపడిన యువకుడు
రిపోర్టర్: శివ
స్థలం: బెంగళూరు
బెంగళూరులో రాపిడో బైక్ పై వెళ్తుండగా వేగంగా వచ్చిన బస్సు ఢీకొనడంతో ప్రాణాలతో తృటిలో బయటపడ్డానని పారిశ్రామికవేత్త ప్రియాన్షు రత్నాకర్ వెల్లడించారు. కోరమంగళ నుంచి హెచ్ఎస్ఆర్ లేఅవుట్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. ప్రమాదం తరువాత బస్సు డ్రైవర్ తమను క్షమాపణ కోరాల్సింది పోయి బూతులు తిట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితం ఎంతో అనిశ్చితంగా ఉంటుందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.