సూళ్లూరుపేట పురపాలక ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం

రిపోర్టర్: Darla Venkateswarlu స్థలం: సూళ్లూరుపేట

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పురపాలక ఎన్నికల నామినేషన్ల గడువు ముగియడంతో పరిశీలన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. టీడీపీ అభ్యర్థి పిట్ల సుహాసిని, వైసీపీ అభ్యర్థి మోది విమల తదితరులు పత్రాల పరిశీలనకు పురపాలక కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల అధికారి నాగార్జున ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతుండగా సిఐ మురళీకృష్ణ బందోబస్తు ఏర్పాటు చేశారు.