బ్రేకప్‌తో బయటపడ్డ పేపర్ లీక్.. ప్రేమికులకు విద్యార్థుల ధన్యవాదాలు!
రిపోర్టర్: సురేష్
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్రలో ఎంపీఎస్సీ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం ఒక ప్రేమ జంట బ్రేకప్ ద్వారా వెలుగులోకి వచ్చింది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ప్రియురాలు రితుజ తన ప్రియుడు గౌరవ్‌ను ఫెయిల్ కావడంతో విడిపోయింది. దీంతో కక్షగట్టిన గౌరవ్ పేపర్ లీక్ విషయాన్ని అధికారులకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఈ కుంభకోణం బయటపడటంతో నిరసన తెలిపిన విద్యార్థులు ఆ ప్రేమికుల జంటకు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు.