పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం ఎమ్మెల్యే లలితకుమారి వ్యాఖ్య
రిపోర్టర్: రాము
స్థలం: విజయనగరం
పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని శృంగవరపుకోట నియోజకవర్గ శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కొత్తవలసలోని జడ్పీ వారపు సంత ప్రాంగణంలో నిర్వహించిన పారిశుద్ధ్య డ్రైవ్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని స్వయంగా చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.