అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: అనంతపురం యువకుడు మృతి

రిపోర్టర్: విజయ్ స్థలం: అనంతపురం

అమెరికాలోని అర్కాన్సాస్ రాష్ట్రం లిటిల్ రాక్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన నిస్సార్ అనే యువకుడు మృతి చెందాడు. ఉన్నత చదువులు, ఉద్యోగం కోసం వెళ్లిన కుమారుడు అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ప్రభుత్వం సహకరించాలని కుటుంబీకులు కోరుతున్నారు.