మండుటెండలో ఓటర్ల కష్టాలు చూసి భగ్గుమన్న పకీర్ సాహెబ్ పేట

రిపోర్టర్: Alfa News Desk స్థలం: సరుబుజ్జిలి

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పకీర్ సాహెబ్ పేట గ్రామంలో గురువారం జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తీవ్ర సమస్యలు తలెత్తాయి. పోలింగ్ కేంద్రం వద్ద అధికారుల నిర్లక్ష్యం వల్ల ఓటర్లకు కనీస సౌకర్యాలు కల్పించడంలో వైఫల్యం చెందారు. మండుతున్న ఎండలో నీడ, తాగునీటి సౌకర్యం లేక వృద్ధులు, దివ్యాంగులు గంటల తరబడి నిరీక్షించారు. వీల్ చైర్లు లేకపోవడంతో నడవలేని స్థితిలో అనేక మంది ఓటర్లు ఎంతో అవస్థలు ఎదుర్కొన్నారని గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం అందింది.