'ప్రమాదం తప్పుకుంది': ఏపీ గవర్నర్ కాన్వాయ్‌కు అడ్డొచ్చిన వ్యక్తి
రిపోర్టర్: నరేష్
స్థలం: కృష్ణా జిల్లా
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌కు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి సమీపంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మచిలీపట్నం మంగినపూడి సాగర తీరంలో సప్తమృత్తిక విజయగణపతిని దర్శించుకుని విజయవాడకు తిరుగు ప్రయాణమైన గవర్నర్ కాన్వాయ్‌కు ఓ గుర్తుతెలియని వ్యక్తి ఒక్కసారిగా అకస్మాత్తుగా అడ్డొచ్చాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే వేగంగా స్పందించడంతో ఘోర ప్రమాదం తప్పింది.