ప్రతి విద్యార్థి జీవితంలో విజయం సాధించాలంటూ మంత్రి పయ్యావుల కేశవ్ సూచన

రిపోర్టర్: సునీల్ స్థలం: అనంతపురం

విద్యార్థులు ప్రతి ఒక్కరూ విజయం సాధించాలన్న కసిని కలిగి ఉండాలని రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పర్యటనలో భాగంగా ఆయన స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తరగతి గదిలో కొంతసేపు అధ్యాపకుడిగా మారి పాఠ్యాంశాలతో పాటు నిజ జీవిత విషయాలను బోధించారు. విద్యార్థులకు తొలుత ఎదురయ్యే అవమానాలే భవిష్యత్తులో విజయానికి బాటలు వేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. కళాశాలలో తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలతో పాటు అన్ని మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు ఆయన విద్యార్థులకు భరోసానిచ్చారు.