గణేష్ నిమజ్జనానికి నీరు విడుదల చేయాలంటూ కరీంనగర్ లో భాజపా రాస్తారోకో
రిపోర్టర్: శివ
స్థలం: కరీంనగర్
కరీంనగర్లో గణేష్ నిమజ్జనానికి కాల్వకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భాజపా ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు నేతృత్వంలో చలో చింతకుంట కార్యక్రమం నిర్వహించారు. చింతకుంట కాలువ బ్రిడ్జిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. హిందువుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించిన నాయకులు, వెంటనే ఎస్సార్ ఎస్పీ ద్వారా నీటిని విడుదల చేయాలని హెచ్చరించారు.