నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి: జనసేన నేత తనీష్ సంచలనం
రిపోర్టర్: వెంకట్
స్థలం: తెలంగాణ
తెలంగాణ జనసేన నాయకుడు, నటుడు తనీష్ తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి సీతక్కపై మాట్లాడినందుకు అనామక వ్యక్తుల నుంచి అసభ్యకరమైన మెసేజ్‌లు వస్తున్నాయని ఎక్స్ వేదికగా వెల్లడించారు. వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంటే ఇసుక మాఫియా, కమిషన్ల దందాల చిట్టా బయటపెడతానని తీవ్రంగా హెచ్చరించారు. ప్రజా సమస్యలపై పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.