'సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో చంద్రబాబు పర్యటన': వారణాసిలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక షెడ్యూల్
రిపోర్టర్: రమేష్
స్థలం: వారణాసి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 17న వారణాసిలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా కాశీలో నిర్వహించనున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ప్రధాని ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వారణాసి, వాద్‌నగర్‌లను అనుసంధానిస్తూ నిర్వహించే వారణాసి–వాద్‌నగర్ సేవా యాత్రను సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించనున్నారు.