గతంలో సీఈసీలకు కాంగ్రెస్ లంచాలు: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఫైర్

రిపోర్టర్: కిరణ్ స్థలం: New Delhi

మాజీ సీఈసీలకు కాంగ్రెస్ పార్టీ గతంలో పద్మ అవార్డులు, రాజకీయ పదవులను లంచాలుగా ఇచ్చిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ నిరసనలు తెలుపుతున్న కాంగ్రెస్ నాయకుల తీరు ద్వంద్వ ప్రమాణాలతో కూడుకున్నదని ఆయన మండిపడ్డారు. ఎంఎస్ గిల్, నవీన్ చావ్లా వంటి మాజీ అధికారుల నియామకాల ఉదాహరణలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అగ్రనేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.