దిల్లీలో సంచలనం: ఇరవై ఆరు ఏళ్లుగా పరారీలో ఉన్న హత్య నిందితుడు అరెస్ట్
రిపోర్టర్: నరేష్
స్థలం: New Delhi
గత ఇరవై ఆరు సంవత్సరాలుగా హత్య కేసులో పరారీలో ఉన్న అరవై రెండేళ్ల నిందితుడిని దిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీనియర్ అధికారి వెల్లడించారు. వివాహేతర సంబంధం అనుమానంతో ఇరవై నాల్గు సంవత్సరాల జై ప్రకాష్ పై సుత్తితో దాడి చేసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు దిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.