దారుణం: థాయ్ మహిళను పెళ్లి చేసుకుని అరవై లక్షలు కొల్లగొట్టిన కాన్పూర్ వ్యక్తి

రిపోర్టర్: గోపి స్థలం: Kanpur

సోషల్ మీడియా ద్వారా పరిచయమైన థాయ్ లాండ్ మహిళను వివాహం చేసుకుని, వ్యాపారాల పేరుతో అరవై లక్షల రూపాయలు కాజేసిన ఘరానా మోసాన్ని కాన్పూర్ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. అప్పటికే వివాహం జరిగి ముగ్గురు పిల్లలు ఉన్న నిందితుడు ఇర్ఫాన్, బాధితురాలు అప్సోర్న్ ను శారీరకంగా వేధిస్తూ మతమార్పిడికి ఒత్తిడి తెచ్చాడని అధికారులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.