అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బీఆర్ఎస్ నేత కేటీఆర్
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
శాసనసభ వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ భూములపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు, విచారణ ఆదేశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ అసెంబ్లీలో అబద్ధాలు చెప్తున్నారని, ఫామ్‌హౌస్ వెయ్యి ఎకరాల్లో ఉందన్న నోటితోనే ఇప్పుడు 67 ఎకరాలు ఉన్నట్లు మాట మార్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తండ్రి కాలం నుంచే వందలాది ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, సంబంధం లేని వ్యక్తుల ఆస్తులను కూడా కేసీఆర్ ఖాతాలో కలపడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.