మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలను కొనియాడిన మంత్రి కోమటిరెడ్డి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: నల్గొండ

భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘనంగా స్మరించుకున్నారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారని, ఆర్థిక వ్యవస్థను సంస్కరించి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారని ఆయన పేర్కొన్నారు. హక్కుల ఆధారిత చట్టాలతో పౌరులను సాధికారం చేయడంతో పాటు, తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షను నెరవేర్చడంలో ఆయన దార్శనిక నాయకత్వం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశంసించారు.