హైవేపై కార్గో వాహనంలో అగ్నిప్రమాదం: దగ్ధమైన టాటా బడా దోస్త్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ప్రకాశం
ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తున్న కార్గో వాహనంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఒంగోలు నుంచి కావలి వైపు స్వీట్ల సరకుతో వెళ్తున్న వాహనం ఏసీ భాగం నుంచి పొగ రావడంతో డ్రైవర్ ప్రవీణ్ అప్రమత్తమై కిందకు దిగాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.