డిజిటల్ హైవే బిల్బోర్డుల హ్యాకింగ్: అశ్లీల వీడియోల ప్రదర్శనతో అంతర్జాతీయంగా కలకలం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: International
సైబర్ నేరగాళ్లు డిజిటల్ హైవే బిల్బోర్డులను హ్యాక్ చేసి అశ్లీల వీడియోలను ప్రదర్శించారని అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. ఈజిప్ట్, మలేషియా, బ్రెజిల్ దేశాల్ లో జరిగిన ఈ ఘటనల వల్ల రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారని అధికారులు తెలిపారు. ప్రకటనల స్థానంలో ఇటువంటి అసభ్యకర దృశ్యాలు రావడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటనలు ఇంటర్నెట్ వ్యవస్థల భద్రతపై తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.