విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ అడుగులు: ఢిల్లీ కోచ్ ఆసక్తి
రిపోర్టర్: సురేష్
స్థలం: న్యూఢిల్లీ
విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ ఆడే అవకాశం ఉందని ఢిల్లీ జట్టు కోచ్ విజయ్ దహియా వెల్లడించారు. కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ లో ఉంటే యువ ఆటగాళ్లకు ఎంతో స్ఫూర్తి దాయకంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దేశీయ టోర్నీ ద్వారా మ్యాచ్ ప్రాక్టీస్ పొందేందుకు రోహిత్ శర్మతో పాటు కోహ్లీ కూడా సిద్ధమవుతున్నారు. 2027 వన్డే ప్రపంచ కప్ లక్ష్యంగా సీనియర్ ఆటగాళ్లు ముందుకు సాగుతున్నారు.