టాలీవుడ్ ఎంట్రీ: నటి అర్చనా జోయస్ కొత్త సినిమా పూజా కార్యక్రమం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

కేజీఎఫ్ చిత్రంలో హీరో తల్లిగా నటించి విశేష గుర్తింపు పొందిన నటి అర్చనా జోయస్ టాలీవుడ్ లో హీరోయిన్గా అడుగుపెడుతున్నట్లు దర్శకుడు దివాకర్ యడ్ల తెలిపారు. కిషోర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎన్.ఎన్. కిషోర్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోందని ఆయన వెల్లడించారు. విజయ్ రాజ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగిందని, హైదరాబాద్ మరియు కేరళలో షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసినట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.