వ్యర్థాల నుంచి అద్భుతం: టమాటా వ్యర్థాలతో బయో లెదర్ తయారు చేస్తున్న యువకుడు

రిపోర్టర్: వెంకట్ స్థలం: Mumbai

వ్యర్థంగా పడేసే టమాటాలతో బయో లెదర్ను తయారు చేసి పీటా అవార్డు గెలుచుకున్నారు ప్రీతేష్ మిస్త్రీ. ముంబైకి చెందిన ఈ బయోటెక్నాలజీ విద్యార్థి కళాశాల ప్రాజెక్ట్గా ఈ ఆలోచనను ప్రారంభించి, ప్రస్తుతం ఫ్యాషన్ పరిశ్రమకు సరికొత్త ప్లాంట్ ఆధారిత ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్నట్లు వ్యవస్థాపకులు తెలిపారు. వ్యవసాయ వ్యర్థాల సమస్యకు చెక్ పెడుతూ, పర్యావరణానికి మేలు చేసేలా టమాటా తొక్కలు, విత్తనాలతో ఈ వినూత్నమైన తోలును తయారు చేయడం విశేషంగా నిలిచింది.