భోగి సినిమా విశేషాలు వెల్లడించిన ప్రముఖ దర్శకుడు సంపత్ నంది
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: కరీంనగర్
అన్నాచెల్లెళ్ల బంధం ఆధారంగా తెరకెక్కించిన భోగి సినిమా నవంబర్ పన్నెండో తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుందని ప్రముఖ దర్శకుడు సంపత్ నంది వెల్లడించారు. కరీంనగర్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహారాష్ట్ర, ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. ప్రజా పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను త్వరలో సినిమాగా తెరకెక్కించే ఆలోచన ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.