తాడేపల్లి ప్యాలెస్ కుట్రతోనే శాప్ అల్లర్లు తేల్చిన పోలీసులు
రిపోర్టర్: సతీష్
స్థలం: విజయవాడ
విజయవాడలోని శాప్ కార్యాలయంపై దాడి, అల్లర్లు తాడేపల్లి ప్యాలెస్ కుట్ర మేరకే జరిగినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. పద్దెనిమిది జిల్లాల నుంచి ఎనభై తొమ్మిది మంది నాయకుల ఆధ్వర్యంలో ఐదు వందల పంతొమ్మిది మందిని తరలించినట్లు తేల్చారు. ఈ దాడుల్లో పాల్గొన్న వారిలో అత్యధికులు రౌడీషీటర్లేనని నిర్ధారించారు. ఇప్పటివరకు యాభై నాలుగు మందిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న వైకాపా నేతల కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.