వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులపై అధికారుల సమీక్ష
రిపోర్టర్: అశోక్
స్థలం: వరంగల్
వరంగల్లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల పురోగతిని రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ తో పాటు పలువురు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు శుక్రవారం పరిశీలించారు. ఈ మేరకు హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి ఉన్నతాధికారులు నిర్మాణ స్థలాన్ని సందర్శించి పనులపై సమీక్ష నిర్వహించారని కలెక్టర్ వరంగల్ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఎంవో ముఖ్య కార్యదర్శి శ్రీధర్, ఆర్థిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.