తిరుమలలో కనువిందుగా శ్రీవారి ముత్యపుపందిరి వాహనసేవ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తిరుమల

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ముత్యపుపందిరి వాహనసేవ కనువిందుగా జరిగింది. బాలకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి భూదేవి, శ్రీదేవి సమేతంగా తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం.రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, జీయంగార్లు తదితరులు పాల్గొన్నారు. శనివారం సాయంత్రం అత్యంత విశిష్టత గల గరుడ సేవ జరగనుంది.