నగరి పరిధిలోని వివిధ అంగన్వాడీ కేంద్రాలలో ఘనంగా ఉత్సవాలు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: నగరి
నగరి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాలలో సూపర్వైజర్లు శంకరమ్మ, శ్యామిని, ఇందిర ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉత్సవ్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్ 7 వరకు ఈ వేడుకలు కొనసాగుతాయని వారు తెలిపారు. కేంద్రాలలో చిన్నారులు, గర్భిణులకు అందుతున్న పౌష్టికాహారం, మాతా సంరక్షణ, టీకాలపై లబ్ధిదారులకు సమగ్ర అవగాహన కల్పించారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలపై మహిళల అభిప్రాయాలను సేకరించారు.