'వినాయక నిమజ్జన బందోబస్తు అత్యంత కట్టుదిట్టంగా ఉండాలి': కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్

రిపోర్టర్: కిరణ్ స్థలం: Emmiganur, Kurnool

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వినాయక నిమజ్జన బందోబస్తు ఏర్పాట్లను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన ఆయన, విధుల్లో ఉన్న ట్రైనీ కానిస్టేబుళ్లకు అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.