ఢిల్లీ పోలీసులపై కోర్టు ఆగ్రహం: వ్యవస్థీకృత నేరాల దర్యాప్తుపై తీవ్ర విమర్శలు

రిపోర్టర్: నరేష్ స్థలం: New Delhi

మకోకా చట్టం కింద నిందితులుగా ఉన్న వ్యక్తులు సంవత్సరాల తరబడి నేరాలకు పాల్పడుతున్నప్పటికీ వారిని అరెస్టు చేయడంలో విఫలమైన ఢిల్లీ పోలీసుల తీరుపై ప్రత్యేక కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దర్యాప్తు నివేదిక కేవలం కాలయాపన మాదిరిగా ఉందని స్పెషల్ జడ్జి గౌరవ్ రావు మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించినట్లు తెలుస్తోంది.