ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Andhra Pradesh
వర్షాభావ పరిస్థితులు మరియు తాగునీటి ఎద్దడిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వర్షాలు పడకపోయినా, తాగునీటి సమస్య తలెత్తినా ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ప్రజలందరూ ముందుగానే అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు స్వయంగా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.