గిరిజన హక్కుల కోసం పోరాడిన కొమురం భీం జయంతి వేడుకలు
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: జి.కె.వీధి
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం రింతాడ చేలక వీధి గ్రామంలో ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మడపల సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు.