ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం హత్య కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుడు అరెస్ట్
రిపోర్టర్: గోపి
స్థలం: అహ్మదాబాద్
రాజస్థాన్‌లో ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి ఒక వ్యక్తి హత్య చేసిన కేసులో పరారీలో ఉన్న దినేష్ భాయ్ అంఠాభాయ్ అర్జన్‌భాయ్ దేశాయ్ అనే నిందితుడిని అహ్మదాబాద్ సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్తుల తగాదాల కారణంగా 2002లో దేలారామ్ నాయ్ అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టి హత్య చేసి పరారైన నిందితుడు, అప్పటి నుంచి గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంటూ బ్రోకర్‌గా జీవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.