ముంబై ఆసుపత్రిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేరిక: రాజకీయ వర్గాల్ లో కలకలం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Mumbai

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరినట్లు ఆయన కూతురు సుప్రియా సూలే వెల్లడించారు. ఛాతి నొప్పితో బాధపడుతున్న ఆయనకు వైద్యులు ప్రస్తుతం పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. డిశ్చార్జ్ అయిన కొద్ది గంటల్లోనే ఆయన మళ్లీ ఆసుపత్రిలో చేరడం రాజకీయ వర్గాల్ లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనతో ఫోన్ లో మాట్లాడి ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.