కోహెడ వీడుతున్న ఎంపీడీవో కిష్టయ్యకు ఘనంగా వీడ్కోలు పలికిన బీజేపీ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కోహెడ
సిద్దిపేట జిల్లా కోహెడ మండల ఎంపీడీవో గడ్డం కిష్టయ్య గద్వాల జిల్లా అయిజ మండలానికి బదిలీపై వెళ్తున్నందున సోమవారం ఆయనను కోహెడ మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు జలిగాం రమేష్ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీడీవోగా విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు.