ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

రిపోర్టర్: సతీష్ స్థలం: India

భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ పథకం 2026 కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉన్నత విద్యనందించే ఈ పథకం కింద ఏడాదికి రూ. 50 వేల వరకు ఆర్థిక సహాయం అందనుంది. పదవ తరగతి, ఇంటర్ లేదా తత్సమాన కోర్సుల్లో 60 శాతం మార్కులు సాధించిన అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30, 2026లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎల్ఐసీ వెల్లడించింది.