అమెరికాలో విసిగిస్తే ఇజ్రాయెల్ ప్రధాని అవుతా: డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: గోపి
స్థలం: Washington
అమెరికా ప్రజలు తనపై విసిగిపోతే తాను ఇజ్రాయెల్ దేశానికి వెళ్లి అక్కడి ప్రధానమంత్రి అవుతానని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇజ్రాయెల్ లో తనకు తొంభై తొమ్మిది శాతం ఆమోద రేటింగ్ ఉందని పేర్కొన్నారు. అమెరికాలో తనను వ్యతిరేకించే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.