అభివృద్ధిపై చాలెంజ్: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ లక్ష్మారెడ్డి సవాల్

రిపోర్టర్: రాము స్థలం: జడ్చర్ల

జడ్చర్ల అభివృద్ధిపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధమని, దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సవాల్ విసిరారు. జడ్చర్ల అంబేద్కర్ కళాభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని సూచించారు. ప్రభుత్వం నుంచి ఆసుపత్రికి భూమి కేటాయిస్తే శ్వేతా ఫౌండేషన్ ద్వారా సొంత ఖర్చులతో రూ.25 కోట్లతో ఆసుపత్రి నిర్మిస్తానని లక్ష్మారెడ్డి ఘాటుగా ప్రకటించారు.