న్యాయమూర్తి జస్టిస్ భాటే మృతికి ఏపీ హైకోర్టు ఘన నివాళి
రిపోర్టర్: మహేష్
స్థలం: అమరావతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అవినాష్ సోమకాంత్ భాటే మృతికి ఏపీ హైకోర్టు ఘనంగా నివాళులు అర్పించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ నేతృత్వంలో సోమవారం మొదటి కోర్టు హాలులో ప్రత్యేక సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.