ఏపీలో త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నగారా

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ కసరత్తు వేగవంతం చేసింది. ఫోటో గుర్తింపుతో కూడిన ఓటర్ల జాబితాను ఈ నెల 11న ప్రజల పరిశీలనార్థం ఉంచాలని అధికారులను ఆదేశించింది. స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ముగుస్తున్న తరుణంలో, గడువులోగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది.