ఢిల్లీలో సంచలనం: త్రిపుర యువకుడిపై జాతి వివక్ష వీడియోలో కంటెంట్ క్రియేటర్ అరెస్ట్

రిపోర్టర్: రమేష్ స్థలం: New Delhi

త్రిపుర యువకుడిని జాతి వివక్షతో వేధించి, అవమానపరిచిన సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ అమీర్ షోకీన్ను ఢిల్లీ కోర్టు ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీకి తరలించిందని పోలీసులు తెలిపారు. ఈ వైరల్ వీడియోపై సుమోటోగా స్పందించిన ఢిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారని, కేంద్రమంత్రి కిరణ్ రిజిజుతో పాటు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారని అధికారులు వెల్లడించారు. ఈ దారుణ ఘటనపై ఈఫ్సో విభాగం దర్యాప్తు చేస్తోంది.